మంగళవారం 14 జూలై 2020
National - Jun 21, 2020 , 01:30:57

వలస కూలీలకు సొంతూళ్లలోనే ఉపాధి

వలస కూలీలకు సొంతూళ్లలోనే ఉపాధి

  • 50వేల కోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ 

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి సొంత ఊర్లకు వెళ్లిన వలస కూలీలకు అక్కడే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం రూ. 50 వేల కోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని శనివారం ప్రధాని మోదీ బీహార్‌లోని కథియార్‌ జిల్లా తెలిహార్‌ గ్రామంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌ సీఎంలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇప్పటి దాకా పట్టణాల్లో ఉన్న నైపుణ్యం లాక్‌డౌన్‌ సమయంలో గ్రామాలకు తరలివచ్చిందన్నారు. పట్టణాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కార్మికుల నైపుణ్యాన్ని గ్రామాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని వలసకార్మికులు ఎక్కువగా ఉన్న బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ర్టాల్లో తొలుత అమలు చేయనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిపై దృష్టి సారించాలని నిర్ణయించారు. మొత్తం 116 జిల్లాల్లో ఒక్కొక్కరికి 125 రోజులు పని కల్పిస్తారు.


logo