ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 18:39:27

కరోనా రోగం కాదు.. దేవుడు విధించిన శిక్ష..

కరోనా రోగం కాదు.. దేవుడు విధించిన శిక్ష..

భోపాల్: కరోనా వైరస్ రోగం కాదని, మనం చేసిన పాపాలకు దేవుడు విధించిన శిక్ష అని మధ్యప్రదేశ్‌లోని సంబల్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫికుర్ రెహ్మాన్ బార్క్ అన్నారు. అందుకే కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సా విధానాన్ని కనిపెట్టలేకపోయారని ఆయన చెప్పారు. మనమంతా దేవుడ్ని ప్రార్థిస్తేనే కరోనా అంతమవుతుందని రెహ్మాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో బక్రీద్‌ను పురస్కరించుకుని ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాలను తెరువాలని ఆయన కోరారు. అలాగే మేకలు, గొర్రెలు అమ్మే మార్కెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
logo