సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 14:34:42

క‌రోనా వైర‌స్.. సునామీ లాంటిది

క‌రోనా వైర‌స్.. సునామీ లాంటిది

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ సునామీ లాంటిద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.  ఇవాళ ఆయ‌న పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడారు.  రాబోయే ఆరు నెల‌ల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌నున్న‌ట్లు చెప్పారు.  దేశ ప్ర‌జ‌లు చెప్ప‌లేన‌టువంటి నొప్పిని భ‌రిస్తున్నార‌ని, క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో స‌రైన రీతిలో స్పందించ‌కుంటే, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా దెబ్బ‌తింటుంద‌ని, ఆ త‌ర్వాత దేశం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో ఊహించ‌లేమ‌ని రాహుల్ అన్నారు. కోవిడ్‌19 గురించి అడ‌గిన స‌మ‌యంలో ఆయ‌న స్పందిస్తూ.. అండ‌న్ నికోబ‌ర్ దీవుల్లో జ‌రిగిన ఓ క‌థ మీకు చెబుతాన‌ని,  సునామీ రాక ముందు దీవుల్లో స‌ముద్ర నీరు వెన‌క్కివెళ్లింద‌ని, ఆ స‌మ‌యంలో జాల‌ర్లు చేప‌ల వేట‌కు లోప‌లికి వెళ్లార‌ని, వాళ్లు లోప‌లికి వెళ్ల‌గానే స‌ముద్రం ఉప్పొంగింద‌ని, గ‌వ‌ర్న‌మెంట్‌ను కూడా ఇదే త‌ర‌హా హెచ్చ‌రిస్తున్నాని, కానీ వాళ్లు మ‌నల్ని త‌ప్పుగా ఆర్థం చేసుకుంటున్నార‌ని రాహుల్ అన్నారు. క‌రోనా వైర‌స్ సునామీ లాంటిద‌న్నారు. కేవ‌లం కోవిడ్‌19 మాత్ర‌మే కాదు, ఆర్థిక విప‌త్తును కూడా ఎదుర్కోనేందుకు దేశం సిద్ధంగా ఉండాల‌ని రాహుల్ అన్నారు. logo