సోమవారం 30 మార్చి 2020
National - Mar 25, 2020 , 09:19:53

శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసు

శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసు

శ్రీకాళహస్తి పట్టణంలోని గోపాలవనంకు చెందిన హేమంత్ స్వరూప్ కు కరోనా పాజిటిగ్ గా రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది శ్రీకాళహస్తి పట్టణం.హేమంత్ లండన్ నుండి ఈనెల 19వ తేదిన అతని స్నేహితుడు మున్వర్ బాషాతో కలసి లండన్ నుంచి మద్రాసు    చేరుకున్నాడు. అక్కడ నుంచి శ్రీకాళహస్తి  వచ్చిన తర్వాత తీవ్ర ద‌గ్గుతో బాధపడుతుండడంతో నిన్న పరీక్ష నిమిత్తం తిరుపతి రూయ ఆసుపత్రి  వెళ్ళారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తిరుపతి వైద్యులు హేమంత్ స్వరూప్ కు కరోనా పాజిటివ్ అని చెప్పారు. దీంతో అతనికుటుంబసభ్యుల పరీక్షల నిమిత్తం తిరుపతి రూయలోనే ఉన్నారు.  నేడు మున్వర్ భాషాను అనుమానంతో 108లో తిరుపతికి తరలించారు.


logo