బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 01:23:08

12 ఏండ్ల కిందటే ‘కరోనా’ ప్రస్తావన!

12 ఏండ్ల కిందటే  ‘కరోనా’ ప్రస్తావన!

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ గురించే చర్చ జరుగుతున్నది. కానీ దీని గురించి 12 ఏండ్ల కిందటే ప్రస్తావించారు అమెరికాకు చెందిన రచయిత్రి సిల్వియా బ్రౌన్‌. ‘2020లో న్యిమోనియా లాంటి తీవ్రమైన ఒక వ్యాధి విజృంభిస్తుంది. జర్వంలాంటి లక్షణాలను కలిగి ఉండే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. దీని ద్వారా ఊపిరితిత్తులు దెబ్బతినడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మనకు తెలిసిన వైద్యానికి ఈ వ్యాధి తొందరగా తగ్గకపోవచ్చు’ అని ఆమె రాసిన ‘ఎండ్‌ ఆఫ్‌ డేస్‌: ప్రిడిక్షన్స్‌ అండ్‌ ప్రొపెసిస్‌ ఎబౌట్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' (ప్రపంచం అంతం గురించి జోస్యం)’ పుస్తకంలో ఉన్నది. ఇందుకు సంబంధించిన పుస్తకంలోని ఓ పేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 


logo