శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 10:11:04

7 ల‌క్ష‌లు దాటిన కేసులు.. 20 వేల మంది మృతి

7 ల‌క్ష‌లు దాటిన కేసులు.. 20 వేల మంది మృతి

హైద‌రాబాద్‌: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు ల‌క్ష‌లు దాటింది.  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 22,252 కేసులు న‌మోదు అయ్యాయి.  24 గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా 467 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకున్న‌ది.  దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.  దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 20,160గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  

ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో కోటి మందికిపైగా క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. వైరస్ మ‌ర‌ణాల్లో భార‌త్ 8వ స్థానంలో ఉన్న‌ది.  ఢిల్లీలో ప్ర‌స్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది.  కొత్త కేసుల క‌న్నా.. రివ‌క‌ర్ అయిన కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ది. క‌ర్నాట‌క‌లోనూ 25వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo