గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 07:50:24

మరో మరణం...73కి పెరిగిన వైరస్‌ బాధితులు

మరో మరణం...73కి పెరిగిన వైరస్‌ బాధితులు

  • నాలుగుకు చేరిన కరోనా మృతులు
  • 173కి పెరిగిన వైరస్‌ బాధితులు

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో కరోనా విజృంబిస్తున్నది. ఈ వైరస్‌ వల్ల తాజాగా పంజాబ్‌లో మరొకరు మరణించడంతో కరోనా మరణాల సంఖ్య నాలుగుకి చేరుకుంది. తాజాగా దేశంలో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌, చండీగఢ్‌లో తొలిసారి ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య గురువారానికి 169కి పెరిగింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అన్ని రాష్ర్టాలు కఠిన చర్యలను చేపడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ప్రజా రవాణాపై అధికారులు నిషేధం విధించారు. పంజాబ్‌లో శుక్రవారం నుంచి ప్రజా రవాణాను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకేచోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధించింది.

రాష్ట్రంలోని ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసేయాలని నిర్ణయించింది. అయితే హోం డెలివరీ, హోటళ్ల నుంచి పార్సిల్‌ను తీసుకెళ్లడం లాంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నది. ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నట్లు ప్రకటించింది. సంస్థపై కరోనా ప్రభా వం తీవ్రంగా పడటంతో ఈ నిర్ణ యం తీసుకున్నట్టు తెలిపింది. ముంబైలో డబ్బావాలా సేవలు  శుక్రవారం నుంచి ఈ నెల 31 వర కు నిలిచి పోనున్నాయి. ఢిల్లీలోని సుందర్‌నగర్‌ మార్కెట్‌ను ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు.

అయోధ్యలో శ్రీరామనవమి మేళా!

జనం గుమిగూడకుండా, ఇండ్ల నుంచి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతుండగా, ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని ప్రభుత్వం భిన్నమైన నిర్ణయం తీసుకున్నది. అయోధ్యలో శ్రీరామనవమి సందర్భంగా భారీ మేళా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ రెండో తేదీ వరకు లక్షల మంది పాల్గొనే విధంగా రామనవమి మేళా నిర్వహించనున్నట్లు తెలిపింది. అయోధ్య చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఘన్‌శ్యామ్‌ సింగ్‌ స్పందిస్తూ.. భారీ స్థాయిలో తరలి వచ్చే ప్రజలను తనిఖీ చేసేందుకు తమ వద్ద తగిన వనరులు లేవన్నారు. 


logo
>>>>>>