బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 00:59:00

హెచ్‌ఐవీ మందులతో కరోనా నియంత్రణ!

హెచ్‌ఐవీ మందులతో కరోనా నియంత్రణ!
  • రాజస్థాన్‌ వైద్యారోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి వెల్లడి

జైపూర్‌: కరోనా వైరస్‌ కట్టడికి వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్విరామ కృషి చేస్తున్నారు. కాగా, 2 రకా ల హెచ్‌ఐవీ నియంత్రణ డ్ర గ్స్‌తో కరోనాను కట్టడి చేయవచ్చని రాజస్థాన్‌ వై ద్య ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. తమ రాష్ట్రంలో నలుగురు పాజిటివ్‌ రోగులకు హెచ్‌ఐవీ నియంత్రణ మందులు వాడటంతో కరోనా తగ్గుముఖం పట్టిందని, వారిలో ముగ్గురిని డిశ్చార్జ్‌ చేసినట్టు తెలిపారు. తొలుత పాజిటివ్‌ కేసులు నమోదైన వారిలో ఇద్దరు ఇటలీ నుంచి వచ్చినవారేనన్నారు. ఈ విషయాన్ని కరోనా రోగులకు చికిత్స అందించిన ఎస్‌ఎంఎస్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డీఎస్‌ మీనా ధ్రువీకరించారు. logo
>>>>>>