బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 02:00:44

1.5 కోట్ల మంది బలవుతారు!

1.5 కోట్ల మంది బలవుతారు!
  • 2.3 ట్రిలియన్‌ డాలర్లు ఆవిరవుతాయి
  • కరోనా విలయంపై తాజా అధ్యయనం హెచ్చరికలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందిని బలి తీసుకోనుందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2.3 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని పేర్కొంది. కరోనా ‘తీవ్రత తక్కువ’ ఉన్న సందర్భంలో ఈ మేరకు నష్టం సంభవించవచ్చని వెల్లడించింది. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. తొలి ఏడాదిలోపు చైనా, భారత్‌, అమెరికాలో లక్షల్లో ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేశారు. బ్రిటన్‌ జీడీపీ 1.5 శాతం, అమెరికా జీడీపీ 2 శాతం తగ్గనుందన్నారు. కరోనా ‘తీవ్రత అధికం’గా ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది మృత్యువాత పడొచ్చని అధ్యయనం అంచనా వేశారు. చైనాలోనే 1.2 కోట్ల మంది ప్రాణాలు కోల్పోవచ్చని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 9.2 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లవచ్చని, అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయని పేర్కొన్నారు. ఇక కరోనా ‘తీవ్రత మధ్యస్థం’గా ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్ల మంది మృత్యువాత పడొచ్చన్నారు. ఆర్థిక వ్యవస్థకు 5.3 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం సంభవించవచ్చన్నారు. 


logo