శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 11:58:37

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 మంది మృతిచెందారు. ఇంకా 857 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1252 మంది బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 60 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

ఈ రోజు నమోదైన కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 14 చొప్పున ఉండగా, కృష్ణాలో 9, కర్నూలులో 8, అనంతపురంలో 4, విజయనగరంలో 3, విశాఖపట్నం, కడపలో రెండు చొప్పున, తూర్పుగోదావరిలో ఒకటి కేసు నమోదయ్యాయి.


logo