శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 12:24:07

ఏపీలో 2100 కరోనా కేసులు

ఏపీలో 2100 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు సంబంధించినవారు. ఈ వైరస్‌ బారిన పడిన 50 మంది కోలుకుని ఈ రోజు డిశ్చార్జి అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 591 కేసులు, గుంటూరులో 404, కృష్నా 351, చిత్తూరు 151, నెల్లూరు 126, అనంతపురంలో 118, కడప 99, పశ్చిమ గోదావరి 69, విశాఖపట్నం 66, ప్రకాశం 63, తూర్పుగోదావరి 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కేసుల చొప్పున ఉన్నాయి.


logo