మంగళవారం 14 జూలై 2020
National - May 02, 2020 , 13:50:10

కర్నూలు కార్పొరేషన్‌లో కీలక అధికారికి కరోనా

 కర్నూలు కార్పొరేషన్‌లో కీలక అధికారికి కరోనా

కర్నూలు: ఏపీలో కరోనా పంజా విసురుతోంది. మహారాష్ట్రలో ముంబై తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా కరోనా హాట్ స్పాట్‌ గా మారిపోయింది. అత్యధిక కేసులతో జిల్లా మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు బయటపడినప్పటి నుంచి కర్నూలు జిల్లాలో కరోనా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 1400కు పైగానే ఉండ‌గా.. వీటిలో  కర్నూలు జిల్లాలోనే 436 ఉన్నాయి. ఈ మహమ్మారికి 10మంది బలయ్యారు. కొంతమంది డాకర్టలుకు కూడా వైరస్ సోకడం కలవరం రేపింది. అయితే తాజాగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో కీలక అధికారికి కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఆ అధికారి కరోనా నియంత్రణ విధుల్లో భాగంగా నగరమంతా పర్యటించారు. దీంతో పాటుగా ఆయ‌న రోజువారి స‌మావేశాలు కూడా నిర్వ‌హించారు. అత‌నికి పాజిటివ్ రావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌లెక్ట‌రేట్ నుంచి క‌రోనా ప‌ర్య‌వేక్ష‌ణ విభాగాన్ని మ‌రో ప్రాంతానికి త‌ర‌లించారు.


logo