గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 14:59:52

మొబైల్స్ ద్వారా వైరస్‌ ఎలా వస్తుందంటే...!

మొబైల్స్ ద్వారా వైరస్‌ ఎలా వస్తుందంటే...!

చేతులు ఎంత శుభ్రం చేసుకున్నా, మాస్కులు ఎంత సేపు ధ‌రించినా చేతిలో ఫోన్ ఉన్న‌ప్పుడు అన్నీ మ‌టాష్ అంటున్నారు రాయ్‌పూర్‌కు చెందిన AIIMS వైద్యులు. ముబైల్ వాడేట‌ప్పుడు చేతులు ఆటోమేటిక్‌గా ముఖం ద‌గ్గ‌ర‌కు వ‌స్తాయి. ముఖంపై కొంచెం దుర‌ద‌పెట్టినా చేతులు శుభ్రంగా ఉన్నాయి క‌దా అని ముఖంపై పెట్టేస్తారు. ఫోన్ల‌కు వైర‌స్ అంటుకున్న‌ట్ల‌యితే చేతుల‌ను ఎంత శుభ్రం చేసుకున్నా ఫ‌లితం ఉండ‌దంటున్నారు. ఆరోగ్య కేంద్రాలు, ICUలు ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌లో ఫోన్ల వాడ‌కంపై నిబంధ‌న‌లు విధించాల‌న్నారు. ఫోన్లు వాడిన త‌ర్వాత చేతుల‌ను శానిటైజ‌ర్‌తో శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఫోన్‌ను కూడా తరచుగా  శానిటైజర్‌ స్ప్రే చేసిన గుడ్డతో క్లీన్‌ చేసుకోవాలని సూచించారు. 


logo