గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 10:32:55

కరోనా వైరస్‌: దేశవ్యాప్తంగా ఉన్న టెస్టు సెంటర్లు ఇవే..!

కరోనా వైరస్‌: దేశవ్యాప్తంగా ఉన్న టెస్టు సెంటర్లు ఇవే..!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య సోమవారంతో 43కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) దేశవ్యాప్తంగా 5066 శాంపిళ్లను టెస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో కరోనా పరీక్షల నిమిత్తం ఏర్పాటు చేసిన టెస్టు సెంటర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌, ఏపీలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ, అనంతపూర్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో కరోనా టెస్ట్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని పోర్టు బ్లెయిర్‌లో రీజినల్‌ మెడికల్‌ రీసెర్చి సెంటర్‌లో, అస్సాంలోని గౌహతి మెడికల్‌ కాలేజీ, దిబ్రుగఢ్‌లోని రీజినల్‌ మెడికల్‌ రీసెర్చి సెంటర్‌, బీహార్‌లోని పాట్నాలో ఉన్న రాజేంద్ర మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, చండీగఢ్‌లో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌, ఢిల్లీలోని ఎయిమ్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్‌ కాలేజీ, జామ్‌నగర్‌లోని ఎంపీ షా గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌లలో కరోనా టెస్ట్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 

హర్యానాలోని రోహ్‌తక్‌లో ఉన్న పండిట్‌ బీడీ శర్మ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, సోనిపట్‌లో ఉన్న బీపీఎస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, షిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజ్‌, కాంగ్రాలోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, శ్రీనగర్‌లోని షెర్‌-ఇ-కాశ్మీర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, జమ్మూలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, జంషెడ్‌పూర్‌లోని ఎంజీఎం మెడికల్‌ కాలేజ్‌లలో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరులోని బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఫీల్డ్‌ యూనిట్‌, మైసూర్‌లోని మైసూర్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, కర్ణాటక హసన్‌లోని హసన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, శివమొగ్గలోని షిమోగా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లలో, కేరళలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఫీల్డ్‌ యూనిట్‌, తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, కోజికోడ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో కరోనా టెస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

భోపాల్‌లోని ఎయిమ్స్‌, జబల్‌పూర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్రైబల్‌ హెల్త్‌, మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉన్న ఎన్‌ఈఐజీఆర్‌ఐ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌, నాగ్‌పూర్‌లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌ ఫర్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌, మణిపూర్‌లోని జేఎన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ హాస్పిటల్‌, ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రీజినల్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌, పుదుచ్చేరిలో ఉన్న జవహర్‌ లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పాటియాలా, అమృతసర్‌లలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌, జోధ్‌పూర్‌లోని డాక్టర్‌ ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజ్‌, ఝలావర్‌లోని ఝలావర్‌ మెడికల్‌ కాలేజ, బికనీర్‌లోని ఎస్‌పీ మెడికల్‌ కాలేజ్‌, చెన్నైలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌, థెనిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, అగర్తలాలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ, వారణాసిలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజ్‌, హల్దానిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, కోల్‌కతాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కలరా అండ్‌ ఎంటరిక్‌ డిసీజెస్‌, ఐపీజీఎంఈఆర్‌లలో కరోనా టెస్టింట్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ఇక కరోనా వైరస్‌కు గాను అవసరమైన వైద్య సహాయం కోసం +91-11-23978046 అనే ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే [email protected] పేరిట హెల్ప్‌లైన్‌ మెయిల్‌ ఐడీని, mohfw.gov.in పేరిట వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. 


logo
>>>>>>