మంగళవారం 09 మార్చి 2021
National - Aug 11, 2020 , 02:33:31

2020 చివరినాటికి వ్యాక్సిన్‌

2020 చివరినాటికి వ్యాక్సిన్‌

  • l మరో రెండు నెలల్లో తుది ధరను నిర్ణయిస్తాం
  • l సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి

న్యూఢిల్లీ: కొవిడ్‌-19కు ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. మరో రెండు నెలల్లో వ్యాక్సిన్‌ అసలు ధరను నిర్ణయిస్తామని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి భాగస్వామిగా ఎస్‌ఐఐ చేరినవిషయం తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే భారత్‌లో వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతి కూడా పొందింది.  

VIDEOS

logo