శనివారం 04 జూలై 2020
National - Jun 24, 2020 , 17:29:50

క‌రోనా ట్రీట్మెంట్‌.. కేజ్రీవాల్ వ‌ర్సెస్ అమిత్ షా

క‌రోనా ట్రీట్మెంట్‌..  కేజ్రీవాల్ వ‌ర్సెస్ అమిత్ షా

హైద‌రాబాద్‌:  ఢిల్లీలో క‌రోనా వైర‌స్ చికిత్స విష‌యంలో కేంద్రానికి, ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ధ్య చిచ్చు చెల‌రేగుతున్న‌ది.  ప్ర‌తి కోవిడ్ పేషెంట్ క్లినిక‌ల్ ప‌రీక్ష కోసం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి వెళ్లాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. ఢిల్లీ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు.  దీన్ని ఆప్ ప్ర‌భుత్వం వ్య‌తిరేకిస్తున్న‌ది. గ‌తంలో ఇదే అంశంపై గ‌వ‌ర్న‌ర్ బైజాల్‌తోనూ వివాదం నెల‌కొన్న‌ట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా తెలిపారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తి క‌చ్చితంగా అయిదు రోజుల పాటు ఇన్స్‌టిట్యూష‌న్ క్వారెంటైన్ కావాల‌ని గ‌వ‌ర్న‌ర్ బైజాల్ ఆదేశించారు. ఆ ఆదేశాల‌ను కూడా ఢిల్లీ స‌ర్కార్ తిర‌స్క‌రించింది. 

హాస్పిట‌ళ్ల‌లో సరిపోను వ‌స‌తులు లేవు అని, ఇప్పుడు ఇది షా మోడ‌లా లేక కేజ్రీవాల్ మోడ‌ల్ అన్న‌ది విష‌యం కాదు అని డిప్యూటీ సీఎం సిసోడియా తెలిపారు. కొత్త ప‌ద్ధ‌తి వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆ విధానాన్ని వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.  logo