ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 18:03:45

ఏప్రిల్ 6 నుంచి విశాఖ ల్యాబ్‌లో క‌రోనా ప‌రీక్ష‌లు

ఏప్రిల్ 6 నుంచి విశాఖ ల్యాబ్‌లో క‌రోనా ప‌రీక్ష‌లు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ వేగంగా పెరుగుతున్నది. కానీ అందుకు త‌గ్గ‌ట్టుగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డానికి స‌రిప‌డా ల్యాబ్‌లు లేవు. దీంతో ఏపీ స‌ర్కారు ల్యాబ్‌ల సంఖ్య‌ను మ‌రింత పెంచ‌డంపై ప్ర‌ధానంగా దృష్టిసారించింది. అందులో భాగంగానే ఏప్రిల్ 6 నుంచి విశాఖప‌ట్నంలోని ల్యాబ్‌ను క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డానికి అందుబాటులోకి తేనుంది. విశాఖ ల్యాబ్‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఏడు ల్యాబ్‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌వుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 

ఇక నుంచి రాష్ట్రంలో రోజుకు 500 క‌రోనా టెస్టులు చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. సీఎం జ‌గ‌న్‌తో స‌మీక్ష అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. రాష్ట్రంలో మొత్తం 161 క‌రోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. అందులో 140 మంది ఢిల్లీలోని మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌కు హాజ‌రై వ‌చ్చిన‌వారేన‌ని చెప్పారు. ఏపీకి చెందిన 1081 మందిలో 946 మందిని క్వారెంటైన్‌కు త‌ర‌లించామ‌ని, మిగ‌తా వారు ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్నార‌ని మంత్రి తెలిపారు.     

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo