శుక్రవారం 29 మే 2020
National - Apr 09, 2020 , 01:01:18

ఉచితంగా కరోనా పరీక్షలు

ఉచితంగా కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ఏజెన్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు జారీ చేయాలని స్పష్టం చేసింది. దేశ ప్రజలందరికీ ఉచిత కరోనా నిర్ధారణ జరీక్షలు నిర్వహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ న్యాయవాది శశాంక్‌ దేవ్‌ సౌదీ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ.4,900 వసూలు చేస్తున్నారని తెలిపారు. దీంతో పేదలు పరీక్షలకు దూరంగా ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌లు అశోక్‌ భూషణ్‌, ఎస్‌ రవీంద్రభట్‌తో కూడిన ధర్మాసనం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఎన్‌ఏబీఎల్‌, ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన అన్ని ల్యాబ్‌లు, ఏజెన్సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


logo