గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 18:06:33

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు : టీటీడీ ఈవో

 శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు : టీటీడీ ఈవో

తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో అదనపు ఈవో  ఏవీ ధర్మారెడ్డి, జేఈవో పి.బసంత్ కుమార్, జిల్లా కలెక్టర్  నారాయణ భరత్ గుప్తా, సీవీఎస్ వో  గోపినాథ్ జెట్టిలతో సమావేశమయ్యారు. తిరుమలలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ టెస్ట్ ల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజులు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు.  పరిస్థితిని సమీక్షించి బర్ద్ దవాఖానను కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని ఈవో చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయాన్ని కలెక్టర్ కు అప్పగించాలని జేఈవోను ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చేయాలన్నారు. 


logo