అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోదండ రాముడి కల్యాణం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్ రెడ్డి వెల్లడించారు.
శుక్రవారం ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వామివారి కల్యాణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు.
కొవిడ్ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 5 వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి