మంగళవారం 26 జనవరి 2021
National - Nov 27, 2020 , 01:46:16

కరోనా పరీక్షలు చేసే రోబో

కరోనా పరీక్షలు చేసే రోబో

కైరో: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దవాఖానాల్లో రోబోల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు రోగుల పర్యవేక్షణ, వైద్య సిబ్బందికి సహకారం, దవాఖానల్లో శానిటైజేషన్‌ వంటి పనులను రోబోలతో చేయిస్తున్నారు. తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించే రోబోను ఈజిప్ట్‌లోని ఒక ప్రైవేటు దవాఖానలో ప్రవేశపెట్టారు. ఆ దేశానికి చెందిన మహమద్‌ ఎల్‌ కోమి దీనిని తయారు చేశారు. మనిషిని పోలిన తల, రోబోటిక్‌ హ్యాండ్‌, స్క్రీన్‌, ఇతర పరికరాలతో కూడిన ఈ రోబో పేరు ‘సిరా-03’. దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఈ రోబో శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడంతోపాటు నోటి నుంచి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేస్తుంది. ఈసీజీ, ఎక్స్‌ రే తీయడం వంటి పనులు కూడా చేస్తుంది. స్క్రీన్‌పై వాటి ఫలితాలను చూపుతుంది. 


logo