గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:07:04

కేరళలో కరోనాకు గుడి.. నిత్య పూజలు..!

కేరళలో కరోనాకు గుడి.. నిత్య పూజలు..!

కడక్కల్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిని అరికట్టేందుకు ఎందరో శాస్ర్తవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మరి అటువంటి  కరోనాకు ఎవరైనా పూజలు చేస్తారా.? అంటే చేస్తారు అనే సమాధానమే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్‌కు నిత్య పూజలు జరిగే ప్రాంతాలు రెండు ఉన్నాయి.  అవి ఎక్కడో తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ పట్టణంలో చినమస్తా చెరును ఒడ్డున కరోనా వైరస్‌ను అమ్మవారిగా భావిస్తూ ‘కరోనా మాయి’ పేరుతో గుడి కట్టి  కరోనా శాంతించాలంటూ నిత్యం పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రాంతంలో  కూడా ఇదే జరుగుతుంది. కేరళ రాష్ట్రంలోని కడక్కల్ పట్టణంలో అనిలన్ అనే వ్యక్తి తన ఇంట్లోనే కరోనాకు గుడి ఏర్పాటు చేశాడు. కాళీమాత విగ్రహం వద్ద కరోనా నమూనను వేలాడదీసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ‘గాలిలో దేవుడుంటాడని నమ్ముతాను. అందుకే కరోనాను పూజిస్తున్నా’ అంటూ అనిలన్ చెప్పడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo