ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 20:05:11

తమిళనాడులో ఒక్కరోజే 78 మందిని మింగిన కరోనా

తమిళనాడులో ఒక్కరోజే 78 మందిని మింగిన కరోనా

చెన్నై : తమిళనాడు రాష్ర్టంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. వేలల్లో కరోనా కేసులు నమోదవుతుండగా వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో కరోనాతో 78 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 2,481 మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 4,979 కరోనా కేసులు ఒక్కరోజులో నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,70,693కి చేరింది. ఇందులో 50,294 మంది కరోనా వ్యాధి సోకి దవాఖానల్లో చికిత్స పొందుతుండగా మిగతా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo