సోమవారం 30 మార్చి 2020
National - Mar 04, 2020 , 07:21:18

కాకినాడ జీజీహెచ్‌కు కరోనా అనుమానితుడు!

కాకినాడ జీజీహెచ్‌కు కరోనా అనుమానితుడు!

అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఇటీవలే దక్షిణకొరియా వెళ్చొచ్చాడు. దక్షిణకొరియా నుంచి వారం క్రితమే హైదరాబాద్‌ చేరుకుని అక్కడినుంచి స్వగ్రామం వాడపాలెంకు పయనమయ్యాడు. మూడు రోజులపాటు వాడపాలెంలో ఉండి అనంతరం అక్కడినుంచి అత్తగారిళ్లు గోదశివారిపాలెంకు వెళ్లాడు. అధికారులు హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం గడిచిన అర్థరాత్రి వాడపాలెంకు వెళ్లి ఆరా తీశారు. అయితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా సోకిందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఉద్యోగిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఉద్యోగి భార్యతో పాటు అత్తగారింట్లోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.


logo