శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 29, 2020 , 17:02:25

విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా స్ట్రెయిన్‌

విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా స్ట్రెయిన్‌

హైదరాబాద్‌ : విదేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో పోలిస్తే యూకే స్ట్రెయిన్‌ త్వరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. స్ట్రెయిన్‌ జన్యు పరిణామ క్రమాన్ని గుర్తించేందుకు జీనోమ్‌ పరీక్షల కోసం 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇదిలాఉండగా యూకే నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన ఓ మహిళలో యూకే స్ట్రెయిన్‌ లక్షణాలు ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది.

సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల్లో స్ట్రెయిన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. సదరు మహిళ కుమారుడికి కొవిడ్‌-19 పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. మహిళతో సన్నిహితంగా ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. యూకే నుంచి వచ్చిన వారితో స్ట్రెయిన్‌ వ్యాప్తిచెందిన దాఖలాలు లేవని, ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని సూచించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo