శుక్రవారం 29 మే 2020
National - Apr 10, 2020 , 17:30:31

కరోనా వల్ల జరిగిన మేలు అదేనట..

కరోనా వల్ల జరిగిన మేలు అదేనట..

హైదరాబాద్: కరోనా ఓ ఘోరమైన వైరస్.. అది మనుషులను ధ్వంసం చేయడానికి వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ కరోనా వల్ల ఓ మేలు జరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్‌సింగ్ అంటున్నారు. డ్రగ్స్ దారులను అది విజయవంతంగా మూసివేయగలిగిందని ఆయన గర్వంగా ప్రకటించారు. వెయ్యిమంది పోలీసులతో ఓ బలగాన్ని ఏర్పటు చేసి డ్రగ్స్ మహమ్మారిని అడ్డుకోవాలని ప్రయత్నించానని, ఇప్పుడ మరో మహమ్మారి వచ్చి దానికి అడ్డుకట్ట వేసిందని ఆయన అన్నారు. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలు ఇక రాష్ట్రంలోకి ఎంతమాత్రం రావడంలేదని అధికారులు తనకు చెప్పారని వివరించారు. పాకిస్థాన్ తో సుదీర్గమైన సరిహద్దు కలిగిన పంజాబ్ చాలాకాలంగా డ్రగ్స్ సమస్యను ఎదుర్కుంటున్నది. అది ఒకరకంగా దేశంలోకి డ్రగ్స్ రాకకు ప్రవేశద్వారంలా పనిచేసిందని కూడా అంటారు. ప్రస్తుత లాక్‌డౌన్ కొనసాగించాలని పంజాబ్ సీఎం అన్నారు. మహమ్మారి కూడా ఘోరంగా విస్తరిస్తున్నదని వైద్యనిపుణులు అంటున్నారని చెప్పారు.


logo