శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 00:50:39

క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్

 క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్

హైదరాబాద్: మొన్నటి వరకు కరోనా మహమ్మారి కొందరికే వచ్చింది... ఇప్పుడు దాని విజృభన మరింతగా పెరుగుతున్నది. ఎంతగా అంటే కరోనా వైరస్ ఒకరికి వచ్చినా ఇంట్లో అందరూ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వ్యాధినిరోధకత తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా వ్యాపిస్తోంది. అందుకే వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. అందుకోసం విటమిన్‌ సి, డి3, జింకు తదితర మాత్రలు ఉపయోగిస్తున్నారు. అయితే మందులతో కాకుండా వంటింట్లో దొరికే పధార్ధాలతో వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవచ్చు.

హోమ్ క్వారంటైన్‌లో ఉన్న‌వారికి క‌రోనా స్పెష‌ల్ డైట్ ప్లాన్ ఉదయం లేవగానే తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, పసుపు నీటిలో కలిపి వేడి చేసుకొని తీసుకోవడం వల్ల గొంతులో గరగర, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది తీసుకున్న తర్వాత 30 నిముషాలు వ్యాయామం చెయ్యాలి. శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి అప్పుడే విటమిన్ డి లభిస్తుంది. టిఫిన్ 8 గంటల లోపు పూర్తి చెయ్యాలి. అయితే టిఫిన్ గా మినప లేదా రాగి పిండితో చేసిన ఇడ్లీలు, అందులో క్యారెట్‌, ఆకుకూరలు తురిమి వేసుకోవచ్చు. మొలకలు తీసుకోవడం ద్వారా సి, ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు లభిస్తాయి. ఉదయం 11 గంటలకు ఫ్రూట్స్ తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో ఆకుకూరతో కలిపి వండిన పప్పు, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్‌, క్యాబేజీ వంటి కూరలు తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ప్రోటీన్స్ కోసం చికెన్‌, మటన్‌, చేపలు, పన్నీరు తీసుకోవాలి. వీటిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. శాకాహారులు అయితే శనగలు, బొబ్బర్లు, సోయాబీన్స్‌ తీసుకోవాలి.సాయంత్రం డ్రై ఫ్రూట్స్, బొబ్బర్లు, అలసందలు, సెనగలు, పుచ్చకాయ, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్‌, సెలీనియం, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. రాత్రి 8 గంటలలోపు భోజనం పూర్తిచేయాలి. భోజనంలోకి జొన్న, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. నిద్రపోయే ముందు కప్పు పాలల్లో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే ఊపిరితిత్తులకు మంచిది. క్వారంటైన్‌లో ఉన్న‌వారు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.logo