మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 10:28:20

ధారావిలో అదుపులో క‌రోనా వైర‌స్ : స‌ంజ‌య్ రౌత్‌

ధారావిలో అదుపులో క‌రోనా వైర‌స్ : స‌ంజ‌య్ రౌత్‌

హైద‌రాబాద్‌: రాజ్య‌స‌భ‌లో కోవిడ్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా శివ‌సే ఎంపీ సంజ‌య్ రౌత్ మాట్లాడారు.  త‌న త‌ల్లి, సోద‌రుడికి కూడా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింద‌ని, అయితే మ‌హారాష్ట్ర‌లో వేల సంఖ్య జ‌నం వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ముంబైలోని ధారావిలో ప్ర‌స్తుతం వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకున్న‌ట్లు ఎంపీ రౌత్ తెలిపారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిందించ‌డం స‌రికాదు అని ఆయ‌న అన్నారు. సుమారు 30 వేల మంది త‌మ రాష్ట్రంలో వైర‌స్ నుంచి కోలుకున్నార‌ని, మ‌రి వారంతా ఎలా కోలుకున్నార‌ని, వాళ్లంతా బాబీజీ పాప‌డ్ తిని కోలుకున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇదేమీ రాజ‌కీయ పోరాటం కాదు అని, ఇది జీవితాల‌ను కాపాడే పోరాటం అన్నారు. క‌రోనాను నియంత్రించేందుకు బాబీజీ పాప‌డ్ ఉపయోగ‌ప‌డుతుంద‌ని ఓ బీజేపీ ఎంపీ పేర్కొన్న విష‌యం తెలిసిందే.logo