బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 19:31:41

నమోదవుతున్న కరోనా కేసుల కన్నా.. రిక‌వ‌రీ రేటే ఎక్కువ

నమోదవుతున్న కరోనా కేసుల కన్నా.. రిక‌వ‌రీ రేటే ఎక్కువ

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు రోజురోజుకు మెరుగుప‌డుతున్న‌ది. ప్ర‌తిరోజు సుమారు 20 వేల కొత్త కేసులు న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య కూడా అంత‌కుమించే ఉంటున్న‌ది. దీంతో రిక‌వ‌రీ రేటు రోజురోజుకు క్ర‌మంగా మెరుగుప‌డుతున్న‌ది. గురువారం సాయంత్రం నుంచి శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 20,033 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,79,891కి చేరింది. అయితే యాక్టివ్ కేసులు మాత్రం కేవ‌లం 2,27,439 మాత్ర‌మే ఉన్నాయి. అంటే యాక్టివ్ కేసుల కంటే రిక‌వ‌రీ కేసుల సంఖ్య 1,52,452 ఎక్కువ‌గా ఉన్న‌ది. దీంతో దేశంలో రిక‌వ‌రీ రేటు 60 శాతాన్ని దాటి 60.73 శాతానికి చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo