ఆదివారం 12 జూలై 2020
National - Jun 27, 2020 , 16:02:44

దేశంలో మెరుగ‌వుతున్న‌ క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో మెరుగ‌వుతున్న‌ క‌రోనా రిక‌వ‌రీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా మెరుగుప‌డుతున్న‌ది. రోజురోజుకు వైర‌స్ బారిన‌పడుతున్న వారి సంఖ్య కంటే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో రిక‌వ‌రీ రేటు పెరుగుతున్న‌ది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 58 శాతాన్ని దాటింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 5 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, దాదాపు 3 ల‌క్ష‌ల మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. 

కాగా, దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల‌లో 85 శాతం కేసులు కేవ‌లం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ వెల్ల‌డించారు. మ‌ర‌ణాలు కూడా ఆ 8 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనే 87 శాతం ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. ఇక దేశంలోని మొత్తం కేసుల‌లో మ‌ర‌ణాల రేటు 3 శాతంగా ఉన్న‌ద‌ని, కేసుల డ‌బులింగ్ వ్య‌వ‌ధి 19 రోజుల‌కు పెరిగింద‌ని తెలిపారు. దేశంలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను కూడా పెంచామ‌ని, శుక్ర‌వారం ఒక్క‌రోజే 2,30,000 క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని మంత్రి తెలిపారు.      


logo