గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 18:40:10

భారత్‌లో 62.72శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు : రాజేశ్‌ భూషన్‌

భారత్‌లో 62.72శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు : రాజేశ్‌ భూషన్‌

న్యూ ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి రాజేశ్‌ భూషన్‌ అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి శాతం 62.72కు చేరిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుతం 4,02,529 మంది కరోనాతో దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. 7,24,577 మంది ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 62.72గా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో మరణ రేటు 2.43గా ఉందని ఆయన తెలిపారు. 

కరోనాను కట్టడి చేయడంలో భారత డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది కృషి ఎంతో ఉందని, ఎయిమ్స్‌ పాత్ర కూడా చాలా ఉందని ఆయన అన్నారు. కేసుల ఇంటెన్సిటీ రేటు కూడా చాలా రాష్ర్టాల్లో తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌ మెరుగైన స్థానంలో ఉందని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo