ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:08:20

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు

ఢిల్లీ :దేశంలో కరోనా రికవరీ గతంలో కంటేపెరుగుతున్నది. శనివారం ఒక్క రోజే అత్యధిక రికవరీలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 36,145 కరోనా  రోగులు చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయినా కోవిడ్ రోగుల సంఖ్య 8,85,576 కు చేరుకున్నది. రికవరీ రేటు అత్యంత గరిష్టంగా దాదాపు 64 శాతానికి చేరుకున్నది. ఇది ఆదివారం 63.92 శాతంగా నమోదయ్యింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగులు, ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మధ్య వ్యత్యాసం వేగంగా పెరుగుతున్నది. ఈ వ్యత్యాసం 4 లక్షలు దాటి ప్రస్తుతం 4,17,694 వద్ద ఉన్నది. ప్రస్తుతం కోవిడ్-19 చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,67,882 కంటే, చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగుల సంఖ్య 1.89 గా ఉన్నది. 


logo