మంగళవారం 07 జూలై 2020
National - Jun 18, 2020 , 22:47:32

మహారాష్ట్రంలో కరోనా విజృంభణ

మహారాష్ట్రంలో కరోనా విజృంభణ

ముంబై : మహారాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. కేవలం గురువారం ఒక్కరోజే ఆరాష్ట్రంలో 3,752కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో   ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,20,504కు చేరగా మృతుల సంఖ్య 5,751కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముంబై సిటీలో ఇప్పటి వరకు 62,799 కరోనా కేసులు నమోదవగా వీరిలో 31,856 మంది కోలుకున్నారని, 3,309మంది మృతి చెందారని బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. 24గంటల వ్యవధిలో ముంబై నగరంలో దాదాపు 1298 కరోనా కేసులు నమోదు కాగా 67మంది చనిపోయారు. logo