గురువారం 02 జూలై 2020
National - Jun 01, 2020 , 21:38:31

ఒక్క రాష్ట్రంలోనే 70 వేల క‌రోనా కేసులు!

ఒక్క రాష్ట్రంలోనే 70 వేల క‌రోనా కేసులు!

ముంబై: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు 5 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో ఇప్ప‌టికే దేశంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య దాదాపు రెండు ల‌క్ష‌ల‌కు చేరువైంది. ఇందులో మ‌‌హారాష్ట్ర‌లోనే  అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. త‌మిళ‌నాడు, ఢిల్లీ ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశ‌మంతా క‌లిసి లక్షా 90 వేల క‌రోనా కేసులు న‌మోదైతే, అందులో ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే కేసుల సంఖ్య 70 వేలు దాటింది. 

మ‌హారాష్ట్ర‌లో సోమ‌వారం కూడా కొత్త‌గా 2,361 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,013కు చేరింది. ఇందులో రాజ‌ధాని ముంబైలోనే 41,099 కేసులు ఉన్నాయి. ఇక మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగానే పెరుగుతున్న‌ది. సోమ‌వారం కొత్త‌గా 76 మంది క‌రోనా రోగులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2362కు చేరింది. కాగా, మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం 37,543 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  


logo