గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 15:07:53

బెంగ‌ళూరులో న‌లుగురు పోలీసుల‌కు క‌రోనా

బెంగ‌ళూరులో న‌లుగురు పోలీసుల‌కు క‌రోనా

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో న‌లుగురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. న‌గ‌రంలోని మ‌ర‌థ‌హ‌లి పోలీస్‌స్టేష‌న్‌లో న‌లుగురు పోలీసులు క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. మ‌ర‌థ‌న‌హ‌లి పోలీస్‌స్టేష‌న్‌కు చెందిన న‌లుగురు పోలీస్ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం వారిని ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లించి, వారి ప్రైమ‌రీ కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నాం అని బెంగ‌ళూరులోని వైట్‌ఫీల్డ్ డివిజ‌న్ డీసీపీ చెప్పారు.

కాగా, క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 9,399 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అందులో 3,527 యాక్టివ్ కేసులు ఉండ‌గా మిగ‌తా వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.      


logo