బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 17:16:04

ఢిల్లీలో సీఆర్పీఎఫ్ డాక్ట‌ర్‌కు క‌రోనా

ఢిల్లీలో సీఆర్పీఎఫ్ డాక్ట‌ర్‌కు క‌రోనా

న్యూఢిల్లీ: ఢిల్లీ బేస్డ్ సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన ఒక సీనియ‌ర్ డాక్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. సీఆర్పీఎఫ్‌లోని ఆరోగ్య విభాగం అధికారులు గురువారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే స‌ద‌రు డాక్ట‌ర్‌ను హ‌ర్యానా రాష్ట్రం ఝ‌జ్జ‌ర్ ప‌ట్ట‌ణంలో ఉన్న ఎయిమ్స్ కు త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఆ డాక్ట‌ర్ సీఆర్పీఎఫ్‌లోని మెడిక‌ల్ విభాగానికి సంబంధించిన అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫీస్‌లో చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ హోదాలో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. అయితే అత‌నికి క‌రోనా ఎవ‌రి నుంచి సోకింద‌నే వివ‌రాలు తెలియ‌రాలేద‌న్నారు. స‌ద‌రు డాక్ట‌ర్ ద‌క్షిణ ఢిల్లీలోని సాకేత్ ఏరియాలోగ‌ల సీఆర్పీఎఫ్ మెస్‌లో ఎక్కువ‌గా ఉండేవాడ‌ని.. దాంతో ఆ మెస్‌లో ఉన్న అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లించామ‌ని అధికారులు పేర్కొన్నారు.   

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo