ఆదివారం 24 మే 2020
National - Mar 20, 2020 , 17:04:49

కరోనా బారినపడ్డ బాలీవుడ్‌ సింగర్‌

కరోనా బారినపడ్డ బాలీవుడ్‌ సింగర్‌

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యూపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18కి చేరింది. అయితే శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కరోనా కేసుల్లో బాలీవుడ్‌ ప్రముఖ గాయని కనికా కపూర్‌ కూడా ఉన్నారు. మార్చి 15న లండన్‌ నుంచి వచ్చిన ఆమెకు శుక్రవారం నాటి పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను లక్నోలోని కింగ్‌జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆమె కుటుంబసభ్యులను, ఆమె ఇంట్లోని పనిమనిషిని కూడా ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇదిలావుంటే కనికా కపూర్‌ లండన్‌ నుంచి వచ్చిన తర్వాత సుమారు 200 మంది అతిథులు పాల్గొన్న ఓ పార్టీకి హాజరయ్యిందని, ఆ పార్టీకి పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానితులను గుర్తించి ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించే పనిలో వైద్యశాఖ అధికారులు ఉన్నారు.     


logo