మంగళవారం 14 జూలై 2020
National - Jun 25, 2020 , 18:20:16

ఐటీబీపీలో మ‌రో 8 మందికి క‌రోనా!

ఐటీబీపీలో మ‌రో 8 మందికి క‌రోనా!

న్యూఢిల్లీ: దేశంలోని భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్, ఐటీబీపీ స‌హా ప‌లు పారామిలిట‌రీ బ‌ల‌గాల్లో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా మ‌రో ఎనిమిది మంది ITBP సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో  ITBPలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 291కి చేరింది. అందులో 221 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 70 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం వారంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ఎవ‌రికీ సీరియ‌స్‌గా లేద‌ని, అంద‌‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఐటీబీపీ అధికారులు తెలిపారు.   


logo