సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 16:17:44

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు డాక్టర్లకు కరోనా

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్లో కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తున్నది. మొదట్లో పెద్దగా కేసులు నమోదు కానప్పటికీ క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా అక్కడి ఐదుగురు వైద్యులకు కరోనా మహమ్మారి సోకింది. వారిలో నలుగురు వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందించిన వారు కూడా ఉన్నారని శ్రీనగర్‌ చెస్ట్‌ హాస్పిటల్‌ హెడ్‌ డాక్టర్ నవీద్‌ షా చెప్పారు. వారందరినీ ఐసోలేషన్‌ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా జమ్ముకశ్మీర్లో ఇప్పటివరకు 1183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మహమ్మారి బారినపడి మరణించారు.


logo