బుధవారం 27 మే 2020
National - May 08, 2020 , 14:12:50

కర్ణాటకలో 24 గంటల్లో 45 మందికి కరోనా

కర్ణాటకలో 24 గంటల్లో 45 మందికి కరోనా

బెంగళూరు: కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 45 కరోనా కేసులు నమోదయ్యాయని కర్ణాటక ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 750కి చేరిందని తెలిపింది. ఇక మొత్తం 750 కేసులలో ఇప్పటివరకు 371 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, 30 మంది మరణించారని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగతా 349  మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.   


logo