సోమవారం 25 మే 2020
National - Mar 29, 2020 , 14:52:17

భార్యాభ‌ర్త‌ల‌కు కరోనా.. ప్రకాశం జిల్లాలో కలకలం

భార్యాభ‌ర్త‌ల‌కు కరోనా.. ప్రకాశం జిల్లాలో కలకలం

ప్రకాశం జిల్లా: జిల్లాలోని చీరాలలో భార్య, భర్తకు కరోనా పాజిటీవ్‌ వచ్చింది. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది ఓ మత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ బృందం ఎక్కడెక్కడ ఉందో అని అధికారులు వెతుకుతున్నాడు. ఇప్పటికే చీరాల, పేరాల ఇద్దరిని, చీమకూర్తి ఒకరిని, కందుకూరులో నలుగురిని, కనిగిరిలో ఏడుగురిని, వెలిగండ్లలో ఒకరిని అధికారులు గుర్తించారు. వీరు ఇచ్చిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా మిగితా వారి కోసం గాలిస్తున్నారు. ఈ బృందం అందిరినీ, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ వార్డుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ బృదంతో ఇంకా ఎవరు వెళ్లారనే కోణంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 


logo