శుక్రవారం 03 జూలై 2020
National - Jun 24, 2020 , 21:11:03

మ‌రో న‌లుగురు ITBP సిబ్బందికి క‌రోనా

మ‌రో న‌లుగురు ITBP సిబ్బందికి క‌రోనా

న్యూఢిల్లీ: భ‌ద్ర‌తా బ‌ల‌గాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బందిలో నిత్యం కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. కొత్త‌గా మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచి బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో న‌లుగురు ITBP సిబ్బందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో  ITBP లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. ఇందులో 18 మంది ఢిల్లీ విభాగానికి చెందిన ఐటీబీపీ సిబ్బంది ఉన్నారు. ఐటీబీపీ ఉన్న‌తాధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న అంద‌రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వారు తెలిపారు.   


logo