ముంబై: లాక్డౌన్ సమయంలో ఎందరో పేదలకు అండగా నిలబడి సాయమందించి ప్రశంసలు పొందిన సినీ నటుడు సోనూసూద్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తన అభిమానులకు ఆయనే ట్విట్టర్లో శనివారం తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్నానని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నానన్నారు.