బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 11:32:20

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ కు కరోనా పాజిటివ్

 పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ కు కరోనా పాజిటివ్

ఢిల్లీ : పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పాకిస్థాన్ ఆటగాళ్లకు పీసీబీ కరోనా వైరస్ పరీక్షలు చేసింది. అయితే అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్‌ కూడా ఉన్నాడు. అయితే అతను ఇంకా ఈ వైరస్ బారినుంచి బయటపడలేదు. హరిస్ తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందులో హరిస్ మాస్క్ లేకుండానే ఉన్నాడు. అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆ అభిమాని ఓ విషయాన్ని తెలిపాడు. అదేంటంటే... ''నేను ఈ రోజు హరిస్ రౌఫ్‌ ను కలిసాను. అలాగే అతనితో ఓ సెల్ఫీ తీసుకున్నాను. ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ పర్యటన కోసం పాక్ జట్టుకు ఎందుకు సెలెక్ట్ కాలేదు అని ఆన్లైన్ లో వెతికాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... అతనికి కరోనా పాజిటివ్ అని దానికి అతని ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు అని తెలిసింది'' అంటూ వివరించాడు. 


logo