గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 14:18:04

వికాస్‌దుబే ఎన్‌కౌంటర్‌లో గాయపడిన కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌

వికాస్‌దుబే ఎన్‌కౌంటర్‌లో గాయపడిన కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌

కాన్పూర్‌ : ఉజ్జయిని గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ పోలీస్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఓ పోలీస్‌ అధికారి ఆదివారం విలేకరులకు తెలియజేశారు. సదరు కానిస్టేబుల్‌ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా శనివారం ఆలస్యంగా ఫలితాలు వచ్చాయని, వెంటనే ఆయన్ను పోలీస్‌ ఐసోలేషన్‌ వార్డులో చేర్చినట్లు గణేశ్‌ శంకర్‌ విద్యార్థి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్ ఆర్బీ కమల్ తెలిపారు. అయితే వాహనంలో ఉన్న మరో నలుగురు పోలీస్‌ సిబ్బందికి కూడా పరీక్షలు చేయగా వారికి నెగిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. 

 గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌దుబేను శుక్రవారం ఉదయం కాన్పూర్‌ సమీపంలో యూపీ పోలీసులు ఉజ్జయిని నుంచి తీసుకెళ్తుండగా ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో వర్షం కారణంగా కారు అదుపుతప్పి బోల్తాపడిందని వారు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో ఓ కానిస్టేబుల్‌ గాయపడగా ఆయనకే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆ కానిస్టేబుల్‌తో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించి వారికి కూడా టెస్టులు చేయనున్నారు. 


logo