ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 18:31:47

'మహా' సీఎం కుమారుడి భద్రతా సిబ్బందికి కరోనా

'మహా' సీఎం కుమారుడి భద్రతా సిబ్బందికి కరోనా

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు తేజస్ ఠాక్రేకు చెందిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి సోమవారం  కరోనా పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు నుంచే తేజస్‌ హోం క్వారంటైన్‌లో ఉంటుండడంతో పాజిటివ్‌ వచ్చిన భద్రతాసిబ్బందితో ఆయన అందుబాటులో లేడని తెలిసింది. దీంతో తేజస్‌ ఇతర భద్రతా సిబ్బంది కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.   కరోనా పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు సిబ్బందిని వెంటనే మరోల్, కలినా క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo