గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:26:56

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రోజూ వేల‌‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,538 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ల‌క్షా అర‌వై వేల మార్కును దాటి 1,60,907కు చేరింది. అందులో 1,10,807 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 47,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో వేగంగా పెరుగుతున్నాయి. శుక్ర‌వారం కొత్త‌గా 79 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 2,315కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం 109 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాయ‌ని, అందులో 55 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు కాగా, 54 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయ‌ని ఆరోగ్య‌శాఖ‌ అధికారులు తెలిపారు. ‌            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo