సోమవారం 30 మార్చి 2020
National - Mar 06, 2020 , 13:07:36

31కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు

31కి చేరిన  క‌రోనా పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌:  దేశంలో నావెల్ కరోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకున్న‌ది.  కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సంజీవ్ కుమార్ ఇవాళ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  ఢిల్లీలోని ఉత్త‌మ్ న‌గ‌ర్‌కు చెందిన ఓ వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు.  థాయిలాండ్‌, మ‌లేషియా నుంచి అత‌ను వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ది. అత‌న్ని అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టారు. వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. సామూహిక వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌జ‌ల‌ను కోరింది. కోవిడ్‌19 వ్యాపిస్తున్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాలు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. logo