మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 14:15:24

అరుణాచల్‌ప్రదేశ్‌లో 650కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

అరుణాచల్‌ప్రదేశ్‌లో 650కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఇటానగర్:  అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 41 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కేసులు 650కి చేరాయని సీనియర్‌ ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. క్యాపిల్‌ కాంప్లెక్స్‌లో 18 మందిని పాజిటివ్‌గా పరీక్షించగా, ఆ తర్వాత లోయర్‌ సియాంగ్‌లో 10, పాపుమ్‌ పరేలో ఆరు, లోయర్‌ దిబాంగ్‌ వ్యాలీలో మూడు, పశ్చిమ కమెంగ్‌, లోయర్‌ సుబన్సిరి జిల్లాల్లో రెండు చొప్పున కేసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. లోయర్ సియాంగ్, లోయర్ దిబాంగ్ లోయ జిల్లాల్లో కేసులు క్వారంటైన్‌ కేంద్రాల్లోనే గుర్తించామని స్టేట్‌ సర్వైవ్‌లెన్స్‌ ఆఫీసర్‌ ఎల్‌ జంపా తెలిపారు. వెస్ట్ కమెంగ్, లోయర్ సుబన్సిరి జిల్లాల్లో ఒక్కో కేసు కూడా క్వారంటైన్ కేంద్రాల్లోనే గుర్తించామని చెప్పారు. బాధితులనంతా కొవిడ్‌-19 కేర్‌ సెంటర్లో చేర్చినట్లు చెప్పారు.

క్యాపిటల్ కాంప్లెక్స్ రాష్ట్రంలో అత్యధికంగా 216 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత చాంగ్ లాంగ్ (37), నామ్‌సాయి (27), ఈస్ట్ సియాంగ్ (21), లోయర్ సుబన్సిరి, లోయర్ సియాంగ్‌లో 14 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 99 మంది రోగులు కోలుకొని శనివారం దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారని జంపా తెలిపారు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌, స్వీయ పర్యవేక్షణలో ఉండాలని సూచనలిచ్చినట్లు చెప్పారు. రాజధాని కాంప్లెక్స్ పాలనా యంత్రాంగం, పాపుమ్ పరే జిల్లా అధికారులు కేసుల గుర్తింపుతో పలు ప్రాంతాలు, భవనాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పాపుమ్ పరే డిప్యూటీ కమిషనర్ పిజ్ లిగు ఆ ప్రాంతంలో ఆరు కేసులు గుర్తించిన తర్వాత దోయిముఖ్ సబ్ డివిజన్ లోని చిప్టువా గ్రామాన్ని కంటైమెంట్ జోన్‌గా ప్రకటించారు. 

గ్రామస్తులను ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లనివ్వబోమని, అధికారుల ముందస్తు అనుమతి లేకుండా అనుమతి లేని వ్యక్తులను లోపలికి అనుమతించబోమని శనివారం జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. క్యాపిటల్ కాంప్లెక్స్ డిప్యూటీ కమిషనర్ కొంకర్ దులోమ్ నహర్లాగున్‌లో ఏడు భవనాలు, ఇటానగ‌ర్‌లో ఒక భవనాన్ని 28 రోజుల పాటు కంటైన్‌ జోన్లుగా ప్రకటించారు.  కాగా, ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లో 373 యాక్టివ్ కేసులు ఉండగా, 274 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 38,042 నమూనాలను పరీక్షించామని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో జూలై 1 నుంచి కొవిడ్‌-19 కేసులు పెరిగాయి. గత 19 రోజుల్లో 459 కేసులు నమోదయ్యాయి.  ఈశాన్య రాష్ట్రం మే 23 వరకు వైరస్ రహిత రాష్ట్రంగా ఉంది.  దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి స్థానికులు ఇక్కడికి వచ్చాక కేసులు పెరిగాయని అధికారులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo