శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 19:47:49

పంజాబ్ లో 1932కు చేరిన పాజిటివ్ కేసులు

పంజాబ్ లో 1932కు చేరిన పాజిటివ్ కేసులు

చండీగ‌ఢ్‌: ప‌ంజాబ్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్త‌గా 13 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1932కు చేరుకుంది. మొత్తం కేసుల్లో 1595 యాక్టివ్ కేసులుండ‌గా..ఇప్ప‌టివ‌ర‌కు 32 మృతి చెందిన‌ట్లు పంజాబ్ వైద్యారాగ్య శాఖ పేర్కొంది. కేంద్రం సూచ‌నల మేర‌కు పంజాబ్‌లో మూడో ద‌శ లాక్ డౌన్ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. పోలీసులు కంటైన్ మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. గ్రీన్ జోన్ల‌లో ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo